AP SLPRB SI Recruitment 2026: 378 Sub Inspector Vacancies, Eligibility, Selection Process & Salary

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB AP) 2026 సంవత్సరానికి సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Rc.No.81/SLPRB/Rect.1/2026, తేదీ 16-09-2026 ద్వారా మొత్తం 378 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నియామక ప్రక్రియను ప్రకటించారు.

ఈ రిక్రూట్‌మెంట్‌లో SCT Sub Inspector of Police (Civil), SCT Reserve Sub Inspector (AR), Sub Inspector (SPF) పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయి.

AP Police SI Recruitment 2026 – ముఖ్యమైన వివరాలు

వివరాలుసమాచారం
రిక్రూట్‌మెంట్ సంస్థSLPRB Andhra Pradesh
పోస్టుల పేరుSub Inspector of Police
నోటిఫికేషన్ తేదీ16 సెప్టెంబర్ 2026
మొత్తం ఖాళీలు378
దరఖాస్తు విధానంఆన్‌లైన్
ఉద్యోగ స్థలంఆంధ్రప్రదేశ్
వయస్సు21 – 27 సంవత్సరాలు
విద్యార్హతడిగ్రీ
ఎంపిక విధానంPreliminary Written Test, PMT, PET, Final Written Exam
పే స్కేల్₹44,570 – ₹1,27,480
అధికారిక వెబ్‌సైట్slprb.ap.gov.in

గమనిక: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరి తేదీ మరియు Preliminary Written Test తేదీలను ప్రత్యేక Press Release ద్వారా ప్రకటిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

AP SI Vacancy 2026 – పోస్టుల వారీగా ఖాళీలు

మొత్తం 378 పోస్టులు మూడు Post Codes కింద ఉన్నాయి.

Post Codeపోస్టుఖాళీలు
11SCT Sub Inspectors of Police (Civil) – పురుషులు & మహిళలు253
12SCT Reserve Sub Inspectors of Police (AR) – పురుషులు & మహిళలు116
31Sub Inspectors – Special Protection Force (SPF) – పురుషులు9
మొత్తం378

నోటిఫికేషన్ ప్రకారం ఈ ఖాళీలు ప్రొవిజనల్‌గా ఉన్నాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అవసరాన్ని బట్టి ఖాళీల సంఖ్యలో మార్పులు చేసే అవకాశం ఉంది.

Zone-wise Vacancies

Post Code 11 మరియు 12 పోస్టులకు జోన్‌ల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి:

జోన్SI CivilRSI AR
Zone-I4220
Zone-II3911
Zone-III3910
Zone-IV4838
Zone-V4318
Zone-VI4219
మొత్తం253116

AP Police SI Eligibility 2026

వయస్సు

Post Code 11, 12 మరియు 31 పోస్టులకు అభ్యర్థులు 1 జూలై 2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి మరియు 27 సంవత్సరాలు పూర్తి చేసి ఉండకూడదు.

అంటే అభ్యర్థి జన్మతేది:

2 జూలై 1999 నుంచి 1 జూలై 2005 మధ్య ఉండాలి.

నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కేటగిరీలకు గరిష్ఠ వయస్సులో సడలింపు ఉంటుంది.

Age Relaxation

నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఉన్న అభ్యర్థులకు:

  • EWS అభ్యర్థులకు గరిష్ఠంగా 5 సంవత్సరాల వరకు
  • BC Non-Creamy Layer / SC / ST అభ్యర్థులకు గరిష్ఠంగా 5 సంవత్సరాల వరకు
  • అర్హత ఉన్న AP State Government ఉద్యోగులకు నిబంధనల ప్రకారం
  • Ex-Servicemen అభ్యర్థులకు నిర్దేశిత నిబంధనల ప్రకారం
  • అర్హత ఉన్న NCC Whole Time Cadet Corps Instructorsకు నిర్దేశిత సడలింపు
  • 1991లో కనీసం 6 నెలల సర్వీస్ చేసిన అర్హత కలిగిన State Census Department retrenched temporary employeesకు గరిష్ఠంగా 3 సంవత్సరాల వరకు

వయస్సు సడలింపు పూర్తిగా నోటిఫికేషన్‌లోని నిబంధనలకు లోబడి ఉంటుంది.

విద్యార్హత

Post Code 11, 12 మరియు 31 పోస్టులకు అభ్యర్థులు 1 జూలై 2026 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కలిగి ఉండాలి.

అయితే SC/ST అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో ప్రత్యేక విద్యార్హత నిబంధన ఉంది. వారి విషయంలో Intermediate మరియు Degreeకు సంబంధించిన నిర్దిష్ట షరతులు వర్తిస్తాయి.

Gender Eligibility

  • SI Civil – Post Code 11: పురుషులు & మహిళలు
  • RSI AR – Post Code 12: పురుషులు & మహిళలు
  • SI SPF – Post Code 31: పురుషులు మాత్రమే

AP SI Selection Process 2026

AP Police SI Recruitment 2026 ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా ఈ దశలు ఉంటాయి:

Preliminary Written Test → PMT → PET → Final Written Examination → Final Selection

1. Preliminary Written Test

మొదటి దశలో రెండు పేపర్లతో Preliminary Written Test నిర్వహిస్తారు.

పేపర్సబ్జెక్ట్ప్రశ్నలుమార్కులు
Paper 1Arithmetic & Test of Reasoning / Mental Ability100100
Paper 2General Studies100100

ప్రతి పేపర్‌కు 3 గంటల సమయం ఉంటుంది.

ప్రతి పేపర్‌లో కనీసం:

  • OC/EWS – 40%
  • BC – 35%
  • SC/ST – 30%

మార్కులు సాధించాలి. ఏదైనా ఒక పేపర్‌లో కనీస అర్హత మార్కులు రాకపోతే అభ్యర్థి అనర్హుడవుతారు.

ముఖ్యంగా, Preliminary Written Testలో సాధించిన మార్కులు Final Selectionకు పరిగణనలోకి తీసుకోరు.
ప్రశ్నలు తెలుగు, ఇంగ్లీష్ మరియు ఉర్దూ భాషల్లో ఉంటాయి.

2. Physical Measurement Test – PMT

Preliminary Written Testలో అర్హత సాధించిన అభ్యర్థులను **Physical Measurement Test (PMT)**కు పిలుస్తారు.

పురుషులకు – Post Code 11, 12 & 31

  • ఎత్తు: కనీసం 167.6 సెం.మీ
  • ఛాతీ: కనీసం 86.3 సెం.మీ
  • ఛాతీ విస్తరణ: కనీసం 5 సెం.మీ

మహిళలకు – Post Code 11 & 12

  • ఎత్తు: కనీసం 152.5 సెం.మీ
  • బరువు: కనీసం 40 కిలోలు

కొన్ని నిర్దిష్ట Agency ప్రాంతాలకు చెందిన Aboriginal Scheduled Tribe అభ్యర్థులకు ప్రత్యేక physical standards నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

3. Physical Efficiency Test – PET

PMTలో అర్హత సాధించిన అభ్యర్థులు PETకు హాజరు కావాలి.

Post Code 12 – RSI AR

మూడు ఈవెంట్లలో అర్హత సాధించాలి:

  1. 1600 మీటర్ల పరుగు
  2. 100 మీటర్ల పరుగు
  3. Long Jump

ఈ మూడు ఈవెంట్లకు కలిపి 100 మార్కులు ఉంటాయి.

Post Code 31 – SI SPF

పురుష అభ్యర్థులు:

  1. 1600 మీటర్ల పరుగు
  2. 100 మీటర్ల పరుగు
  3. Long Jump

ఈ మూడు ఈవెంట్లలో అర్హత సాధించాలి. మొత్తం 100 మార్కులు ఉంటాయి.

PETలో ఈవెంట్లను electronic timing/equipment ద్వారా నిర్వహిస్తారు. Spike shoes అనుమతించరు. ఒకసారి ఈవెంట్ నిర్వహించిన తర్వాత రీ-టెస్ట్ లేదా రీ-కండక్ట్‌కు అవకాశం ఉండదని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

4. Final Written Examination

PETలో అర్హత సాధించిన అభ్యర్థులు Final Written Examinationకు హాజరు కావాలి.

మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 3 గంటల సమయం ఉంటుంది.

పేపర్సబ్జెక్ట్SI CivilRSI AR / SI SPF
Paper IEnglish – Descriptive100100
Paper IITelugu లేదా Urdu – Descriptive100100
Paper IIIArithmetic & Reasoning / Mental Ability200100
Paper IVGeneral Studies200100

Paper I మరియు Paper IIలో నిర్దేశిత కనీస అర్హత మార్కులు సాధించాలి. ఈ రెండు పేపర్ల మార్కులు Final Selectionలో పరిగణనలోకి తీసుకోరు.

AP SI Application Fee 2026

అభ్యర్థుల కేటగిరీఫీజు
AP Local OC/EWS/BC₹600
AP Local SC/ST₹300
AP Non-Local₹600

ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. Credit Card, Debit Card, Net Banking లేదా SLPRB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఇతర payment modes ద్వారా చెల్లించవచ్చు.

ముఖ్యమైన విషయం: ఫీజు చెల్లించిన తర్వాత Stage-I Online Application Formను తప్పనిసరిగా Submit చేయాలి. కేవలం ఫీజు చెల్లించి application submit చేయకపోతే

AP Police SI Recruitment 2026 – ఎలా Apply చేయాలి?

Online application dates అధికారికంగా ప్రకటించిన తర్వాత అభ్యర్థులు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు:

  1. SLPRB AP అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
  2. AP SI Recruitment 2026 Notificationను పూర్తిగా చదవాలి.
  3. మీ వయస్సు, విద్యార్హత, physical standards మరియు ఇతర eligibility conditions చెక్ చేసుకోవాలి.
  4. అవసరమైన application fee చెల్లించాలి.
  5. Stage-I Online Application Form పూర్తి చేయాలి.
  6. Photograph, Signature మరియు అవసరమైన certificates upload చేయాలి.
  7. Applicationలో నమోదు చేసిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
  8. Application Formను Submit చేయాలి.
  9. Submitted application copyని భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసుకోవాలి
  10. .Preliminary Written Testలో అర్హత సాధించిన తర్వాత SLPRB సూచనల ప్రకారం Stage-II application పూర్తి చేయాలి.

AP SLPRB SI Recruitment 2026 – Important Dates

ఈవెంట్తేదీ
Notification విడుదల16-09-2026
Online Application ప్రారంభంత్వరలో ప్రకటించనున్నారు
Application Last Dateత్వరలో ప్రకటించనున్నారు
Preliminary Written Testత్వరలో ప్రకటించనున్నారు
PMT/PETత్వరలో ప్రకటించనున్నారు
Final Written Examinationత్వరలో ప్రకటించనున్నారు

AP Police SI Salary 2026

ఈ పోస్టులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న Pay Scale:

₹44,570 – ₹1,27,480/-

Post Code 11 మరియు 12కు సంబంధించిన అభ్యర్థులకు institutional training సమయంలో ప్రభుత్వం నిర్ణయించే విధంగా stipend చెల్లిస్తారు.

AP Police SI Notification 2026 Important Links

ParticularsLinks
Notification PDFClick Here
Official websiteClick Here
Join Our WhatsApp Channel Click Here

Leave a Comment